ఆలూరులో కూటమి నేతల కీలక సమావేశం
KRNL: ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి స్వగృహంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రోడ్లు, తాగునీరు వంటి నియోజకవర్గ గ్రామీణ సమస్యలపై చర్చించి, వాటి త్వరిత పరిష్కారం కోసం సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి ఏకతతో ముందుకు సాగుతుందని నేతలు వెల్లడించారు.