బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత
NLG: నకిరేకల్ పట్టణంలోని, మొండి వారి కాలనీకి చెందిన నాగిళ్ల నాగరాజు ఇటీవల మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని గురువారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆర్థిక సహాయం అందించారు. పిల్లల చదువుకు ఆటంకం కలుగకుండా ఆదుకుంటానని కుటుంబానికి భరోసా కల్పించారు. ఆయన వెంట జిల్లా నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి ఉన్నారు.