'జీవో 60 ప్రకారం జీతాలు చెల్లించాలి'
KMM: దశాబ్ధాల కాలం పాటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు జీఓ 60 ప్రకారం జీతాలు చెల్లించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు ఆయన ఏఐటీయూసీ సభ్యత్వాన్ని అందించి మాట్లాడారు. కార్మికుల పక్షాన ఏఐటీయూసీ అండగా ఉంటుందని చెప్పారు.