'మహిళల భద్రత కోసం పోస్టర్లు ఏర్పాటు'

'మహిళల భద్రత కోసం పోస్టర్లు ఏర్పాటు'

ASR: మహిళల రక్షణకు పోలీసు శాఖ కట్టుబడి ఉంటుందని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కిషోర్ వర్మ తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం బస్ స్టాప్, పెట్రోల్ బంకు, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మహిళల భద్రతకు సంబంధించిన పోస్టర్లను ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకు సూచనలు, హెల్ప్ లైన్ నెంబర్లు పోస్టర్లలో ఉంటాయన్నారు.