కర్రెగుట్టలను హస్తగతం చేసుకున్న CRPF
తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దు కర్రెగుట్టలను CRPF బలగాలు పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి. ములుగు జిల్లా వాజేడు-మొరామూరులోని CRPF బేస్ క్యాంప్ 39వ కొత్త బెటాలియన్‌ను CRPFఐజీ త్రివిక్రమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్రెగుట్టలను సురక్షితంగా మారుస్తామని, త్వరలో రోడ్ వే నిర్మిస్తామని వెల్లడించారు. ఇకపై ప్రజలు స్వేచ్ఛగా తిరగొచ్చని అన్నారు.