'ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం'
MBNR: భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత హాజరయ్యారు. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసి అభినందనలు తెలిపారు.