VIDEO: అహ్మద్ భాషాకు బెయిల్ మంజూరు

KDP: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష సోదరుడు అహ్మద్ భాషాకు కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఆయనను అరెస్టు చేసి రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి ఇరుపక్షాలు హైకోర్టులో రాజీ అయిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. విచారించిన రెండవ అదనపు మెజిస్ట్రేట్ భార్గవి ఆదేశాలిచ్చారు.