తాడికొండలో పారిశుద్ధ్య లోపం
GNTR: తాడికొండలో పారిశుద్ధ్యం రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలుగా పేరుకుపోయి డంపింగ్ యార్డులుగా దర్శనమిస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పంచాయితీ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటంతో దుర్గంధం వేదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని బుధవారం స్థానిక కోరారు.