రేపు ఏపీలో వర్షాలు

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.