సాయిబాబా ఆలయంలో మార్గశిర పౌర్ణమి పూజలు
ATP: గుత్తి షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో బాబా విగ్రహానికి కాకడ హారతి, అభిషేకం, అష్టోత్తర పూజలు, శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, దీపాలంకరణ, సంధ్య హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో బాబాను దర్శించుకున్నారు.