సహజ కోకిలకు కొవ్వొత్తుల నివాళి
JN: సహజ కోకిలగా పేరొంది గుండెపోటుతో అకాల మరణం చెందిన అందేశ్రీకి ఇవాళ రాత్రి జిల్లా కేంద్రంలో కవులు, కళాకారులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందెశ్రీ మరణం తెలంగాణ సమాజం, సాహిత్యానికి తీరని లోటు అని అన్నారు. ఆయన రచనలు, పాటలు తెలంగాణ సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.