ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంగించరాదు
KMR: మూడు దశలలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అన్ని దశల ఎన్నికలు పూర్తయ్యే వరకు అమలులో కొనసాగుతుందని శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తెలిపారు. జిల్లాలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రవర్తనా నియమావళి మూడవ దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు, ఉంటుందన్నారు.