ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల వెల్లువ

నంద్యాల: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక"లో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS 66 ఫిర్యాదులను స్వీకరించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఉద్యోగ మోసాలు, వ్యవసాయ సమస్యలు వంటి వివిధ అంశాలపై ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.