"ఓల్టేజ్ సమస్యల పరిష్కరించండి"

PLD: వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు ఓల్టేజ్ సమస్య ను ఎదుర్కొంటున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఏ గ్రామంలోనూ ఓల్టేజ్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.