సీఐఐ సమ్మిట్ ఏర్పాట్లతో రేపటి PGRS రద్దు

సీఐఐ సమ్మిట్ ఏర్పాట్లతో రేపటి PGRS రద్దు

VSP: రేపు జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు సీఐఐ సమ్మిట్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నవంబర్ 17 సోమవారం కార్యక్రమం యధావిధిగా నిర్వహించబడుతుందని తెలిపారు.