రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు
NLR: వర్షాల నేపథ్యంలో బుచ్చి పట్టణంలోని మలిదేవి బ్రిడ్జిపై గుంతలు ఏర్పడి వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ రోడ్డును తాత్కాలిక మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ డీ. బాలకృష్ణ, వైస్‌ఛైర్మన్ ఎరటపల్లి వెంకట శివ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.