చనిపోయిన తల్లి పేరుతో ఘరానా మోసం!
ఉత్తరప్రదేశ్‌లో ఒక వ్యక్తి తన తల్లి మరణించినా, ఆమె బతికే ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఏడేళ్లుగా పెన్షన్ కాజేశాడు. ఇలా సుమారు రూ.44 లక్షలు స్వాహా చేసిన ఈ కేటుగాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో ఈ మోసం బయటపడగా, ప్రస్తుతం నిందితుడిపై ఫోర్జరీ, కుట్ర సెక్షన్ల కింద దర్యాప్తు కొనసాగుతోంది.