ఒంగోలులో సైక్లింగ్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు
ప్రకాశం: ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు సైక్లింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ప్రజల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలి, రోడ్డు భద్రత ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు సైక్లింగ్ ప్రోగ్రాం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పోలీసులు పాల్గొన్నారు.