'అర్హులందరికీ ఇళ్లు అందించేలా పథకాన్ని విస్తరిస్తాం'
MHBD: కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన కొత్త ఇళ్లకు ఇవాళ MLA మురళీ నాయక్ ఆధ్వర్యంలో గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. లబ్ధిదారులతో కలిసి పూజలు చేసి ఇళ్లలోకి ప్రవేశించారు. పేదల సొంతిల్లు కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులకు ఇళ్లు అందించేలా పథకాన్ని విస్తరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.