సంక్షేమ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

JN: స్టేషన్ ఘనపూర్ గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలను ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తనిఖీ చేశారు. మౌలిక వసతులు పరిశీలించి, విద్యార్థినిలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు. అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.