మహిళా భద్రతపై పోలీసుల విస్తృత అవగాహన
కడప: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, 'మహిళా భద్రత' స్పెషల్ డ్రైవ్ మాసంలో భాగంగా ఆదివారం పోలీసులు గ్రామాలు, కాలనీల్లో పర్యటించి మహిళలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. BNS చట్టాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలపై వారిని అప్రమత్తం చేశారు. ఆపదలో ఉన్నప్పుడు వెంటనే డయల్ 100, 112, 181, 1098, 1091 లేదా 1930 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.