జిల్లాలో 100 పడకల ESI ఆసుపత్రికి కేంద్రం ఆమోదం
NLR: నగరంలో 100 పడకల ఉద్యోగుల రాష్ట్ర బీమా (ESI) ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. లోక్ సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిస్తూ.. కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరందాజే ఈ విషయాన్ని ధృవీకరించారు. నెల్లూరు జిల్లాలో రెండు 100 పడకల ESI ఆసుపత్రుల ఏర్పాటుకు ESIC సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.