ఆపరేషన్ వజ్రప్రహార్.. 37 బైక్‌లు, 2కార్లు సీజ్

ఆపరేషన్ వజ్రప్రహార్.. 37 బైక్‌లు, 2కార్లు సీజ్

ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ వజ్రప్రహార్‌’లో భాగంగా ఆదివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్‌లో సరైన పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను సీజ్ చేశారు. గంజాయి, దొంగతనాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పాత నేరస్థులను హెచ్చరించారు.