బసవజయంతిని విజయవంతం చేయండి

WGL: పాలకుర్తి శ్రీ లక్ష్మినర్సింహాస్వామి దేవస్థానం పరిసరాలలోని సోమనాధ స్మృతివనంలో సోమనాధ కళాపీఠం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న '891వ ' బసవ జయంతి '' వేడుకని విజయవంతం చేయాలని సోమనాధ కళాపీఠం అధ్యక్షుడు రాపోలు సత్యనారాయణ గురువారం పత్రిక ప్రకటనలో పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై బసవేశ్వరుడికి నీరాజనం పలకాలని వారు కోరారు.