పరకాలలో ఖర్గే దిష్టిబొమ్మ దహనం

పరకాలలో ఖర్గే దిష్టిబొమ్మ దహనం

HNK: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పరకాల పట్టణంలో BJP నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ సర్కిల్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవునూరి మేఘనాథ్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.