పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

భువనగిరి: అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయ భవనానికి బుధవారం ఎమ్మెల్యే మందుల సామేలు శంకుస్థాపన చేశారు. అనంతరం కాంచనపల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లింగయ్య, నాయకులు పాల్గొన్నారు.