నేడు ఈ గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత
తూ.గో: సీతానగరం మండలం ముగ్గుల సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE నటరాజన్ తెలిపారు. రోడ్డు మరమ్మతుల కారణంగా కతవరం, జాలిముడి, బొబ్బిలంక, మూలకాలంక గ్రామాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. పనులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.