రేపటి నుంచి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
SRCL: పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించనున్నారు. జిల్లాలోని 34 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 7,317 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు.