విశాఖ ఉత్సవ్‌కు ఇంఛార్జ్‌లు నియామకం

విశాఖ ఉత్సవ్‌కు ఇంఛార్జ్‌లు నియామకం

విశాఖ ఉత్సవ్‌ను శనివారం నుంచి ఫిబ్రవరి 1వరకు విజయవంతంగా నిర్వహించేందుకు వేదికల వారీగా ఇంఛార్జ్‌ అధికారులను జిల్లా కలెక్టర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్‌కే బీచ్ ప్రధాన వేదిక, గోకుల్ పార్కు, సాగర్‌నగర్, రుషికొండ, భీమిలి బీచ్‌లతో పాటు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల, సన్ స్కూల్, స్వర్ణభారతి వేదికకు ఇంచార్జీలను నియమించారు.