రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి
NLR: కొడవలూరు తలమంచి రైల్వే స్టేషన్ మధ్య దిగువ లైన్‌లో గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి మరణించింది. సదరు మహిళ కుడి చేతిపై ముగ్గు ఆకారంలో పచ్చబొట్టు ఉంది. సదరు మహిళ కాఫీ కలర్ అంచు కలిగిన లైట్ పింక్ కలర్ చీర, పచ్చ రంగు జాకెట్ ధరించి ఉంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.