ప్రజా పరిషత్ కార్యాలయంలో 'మహిళా దినోత్సవం'
అన్నమయ్య: రాయచోటి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో బీ. పరిపూర్ణ అరుంధతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు టీ. సురేష్ బాబు, పరిపాలన అధికారి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. మహిళల పాత్ర సమాజ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని అధికారులు తెలిపారు.