జిల్లాలో పురాతన కట్టడాలు కూల్చివేత
NLR: ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలోని పురాతన కట్టడాలను ఆధునీకరణ పేరుతో భవనాలను హైడ్రాతో సోమవారం కూల్చివేసే పనులు ప్రారంభమయ్యాయి. 136 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలకులు నిర్మించిన ఆసుపత్రి భవనాలు స్థానాల్లో నూతన భవనాలు ఏర్పాటు చేసేందుకు వాటిని ధ్వంసం చేశారు. రూ.5 కోట్ల నిధులతో వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించి వాడుకలోకి తీసుకురానున్నారు.