VIDEO: ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు: సీఐ
ప్రకాశం: కార్తీక పౌర్ణమి సందర్భంగా కనిగిరిలోని ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు సీఐ ఖాజావలి తెలిపారు. పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, కొండపైన కొలువైన శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామి ఆలయాలను పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాటలు చోటు చేసుకోకుండా చూడాలని ఆలయ నిర్వాహకులను ఆదేశించారు.