డుంబ్రిగూడలో రక్తదాన శిబిరం
ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో సోమవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి తహసీల్దార్ త్రివేణి, పలువురు అధికారులు, రాజకీయ నేతలు పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రజలు రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.