వెదులపల్లిలో రౌడీ షీటర్ల వేధింపులు

BPT: బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామంలో రౌడీషీటర్ల వేధింపులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రోడ్డు వెంట వెళ్తున్న ప్రజలను అడ్డగించి కొంతమంది రౌడీషీటర్లు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఎదురు మాట్లాడిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఇలా మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి.