పూలే ఆశయాలకు ప్రభుత్వం తూట్లు: వెంకటరామిరెడ్డి
ATP: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నివాళులర్పించారు. మహిళా విద్యాభివృద్ధికి పూలే చేసిన సేవలను స్మరించారు. జగన్ హయాంలోనే బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో కూటమి ప్రభుత్వం పూలే ఆశయాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు.