VIDEO: ఏమాత్రం ఆదమరిచిన పెను ప్రమాదం
ADB: ఆదిలాబాద్ గ్రామీణ మండలం భీంసరి వెళ్లే మార్గంలో కల్వర్టు అంచున రోడ్డు కోసుకుపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు ఇదే రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. మరోవైపు రాత్రిపూట ద్విచక్ర వాహనదారులు ఏమాత్రం ఆదమరిచిన పెను ప్రమాదం తప్పదని, అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చాలని స్థానిక వాహనదారులు కోరుతున్నారు.