సీఐ శ్రీరామ్ బదిలీ నిలిపివేయాలని వినతి
KRNL: ఆదోని వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ బదిలీ నిలిపివేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాయలసీమ ఇన్‌ఛార్జ్, మోపిరి సూర్య సబ్ కలెక్టర్ అజయ్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. నిజాయితీగల అధికారులను రాజకీయ శక్తులు శాసించడం సమాజానికి హానికరమన్నారు. శ్రీరామ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడమే బదిలీకి కారణమని పేర్కొన్నారు.