రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

నంద్యాల పట్టణం శాంతిరాం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పాణ్యం నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ముందున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి, అనంతరం వేగంగా డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆయనను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.