శ్రీలక్ష్మీ గణపతికి పట్టువస్త్రాలతో ప్రత్యేక అలంకరణ

శ్రీలక్ష్మీ గణపతికి పట్టువస్త్రాలతో ప్రత్యేక అలంకరణ

HNK: జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వరాలయంలో బుధవారం మార్గశిర మాసం సంకష్ట హార చతుర్థి సందర్భంగా శ్రీలక్ష్మీ గణపతికి పట్టువస్త్రాలతో ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతిని భక్తులు అధికసంఖ్యలో దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు ఏర్పాట్లు చేశారు.