స్కూళ్లలో ఆ టీచర్లకు విద్యాశాఖ షాక్!
TG: అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా, వరుసగా 30 రోజులపాటు విధులకు హాజరుకాని ఉపాధ్యాయులను శాశ్వతంగా తొలగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. నెల రోజులు గైర్హాజరైన తర్వాత సదరు టీచర్‌కు వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన ఫేస్ రికగ్నైస్ (FRS) ద్వారా టీచర్లు పాఠశాలకు వచ్చిన, వెళ్లిపోయిన సమయం కచ్చితంగా నమోదవుతోంది.