భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని శివాలయాల్లో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనామస్మరణతో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.