కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ ధరి, మామిడిగూడ, దాహిగూడ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు పార్టీని మరింత బలోపేతం చేసుకుని ఎన్నికల్లో సత్తా చాటుదామని వారన్నారు.