గ్రామంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గం తాళ్లపొలంలో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మణిదీప్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. రైతులకు ప్రకృతి, వ్యవసాయ పద్ధతులు సాగు విధాన ప్రక్రియను వివరించారు. క్రిమిసంహారిక మందులను ఉపయోగిస్తే భూమి నిస్సారమవుతుందని వివరించారు.