రైల్వే ట్రాక్‌పై వింత కారు

KMM: చింతకాని మండలం రామకృష్ణాపురం రైల్వే గేట్ 107 వద్ద రోడ్ కం రైల్ కారు (RCRV) కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. రైల్వే ఎస్ఎస్ఇ టి. వై కృష్ణకుమార్ ప్రయాణిస్తున్న ఈ కారు ట్రాక్‌పై రాగానే గేట్ మూసివేయడంతో, వింతగా కనిపించడంతో ప్రజలు సుమారు అరగంట పాటు వేచి చూశారు. గతంలో పందిళ్లపల్లి స్టేషన్లో పనిచేసిన కృష్ణకుమార్‌ను స్థానికులు గుర్తించి పలకరించారు.