'రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధికి కృషి చేయాలి'

E.G: బిక్కవోలు మండలం కొమరిపాలెం రెడ్డి సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఆత్మీయంగా సత్కరించారు. సంక్షేమ సంఘం అభివృద్ధికి ఎన్నికైన సభ్యులు కృషి చేయాలని సూచించారు.