దసరా పందిరిలో విద్యుదాఘాతం.. ఒకరి మృతి

దసరా పందిరిలో విద్యుదాఘాతం.. ఒకరి మృతి

NTR: దసరా ఉత్సవాల కోసం పందిరి వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి పోతురాజు పవన్ కుమార్ (24) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం నందివాడ మండలంలోని లక్ష్మీనరసింహపురం (కళింగపేట)లో జరిగింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దొడ్లమడుగు గ్రామానికి చెందిన కూలీలు ఈ పనులు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.