CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
PLD: చిలకలూరిపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు రూ. 30.39 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుధవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు. అవసరమైన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.