ఎయిర్‌పోర్టులోనూ బ్లింకిట్‌ సేవలు

ఎయిర్‌పోర్టులోనూ బ్లింకిట్‌ సేవలు

బ్లింకిట్‌తో అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ చేతులు కలిపింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇన్ టెర్మినల్ క్విక్ కామర్స్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ సేవలు ఇప్పుడు టెర్మినల్ 2, డొమెస్టిక్ డిపార్చర్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. బ్లింకిట్ యాప్ ద్వారా విమానాశ్రయంలోని ప్రయాణికులు అవసరమైన వస్తువుల్ని ఆర్డర్ చేసుకోవచ్చు.