కడపలో పారిశుద్ధ్య పనులపై కమిషనర్ మార్నింగ్ విజిట్
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర సోమవారం 12వ, 13వ డివిజన్‌లలో మార్నింగ్ విజిట్ నిర్వహించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల మస్టర్ హాజరు పత్రాలను తనిఖీ చేసి సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం రాజీవ్ పార్క్‌ను సందర్శించి, చిల్డ్రన్స్ పార్క్‌లో చెడిపోయిన ఆట పరికరాలను మరమ్మతు చేయాలని అధికారులకు ఆదేశించారు.